

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ అనే అందమైన పాటను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్. ప్రీతిరెడ్డి విడుదల చేశారు. మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమీరా భరద్వాజ్ ఆలపించిన ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించగా, సునాద్ గౌతమ్ సంగీతం సమకూర్చారు.
పాటలోని అందమైన విజువల్స్, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని చిత్రబృందం తెలిపింది. టీజర్‌ను ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మంచి స్పందన లభించినట్లు పేర్కొంది. పాట విడుదల సందర్భంగా డా. ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, కుటుంబ భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలకు సంభాషణలు అందించిన హనుమాన్ చౌదరి డైలాగ్స్ రాయగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!