

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)కి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లా యూనివర్సిటీల్లో విద్యార్థులను శిక్షించేలా ఆదేశాలు జారీ చేసే చట్టబద్ధమైన అధికారం బీసీఐకి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థుల నిరసనకు సంబంధించిన వ్యవహారంలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు బీసీఐ జారీ చేసిన కమ్యూనికేషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ బీసీఐ పంపిన కమ్యూనికేషన్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. చట్టం ద్వారా బీసీఐకి కల్పించిన అధికారాల పరిధిని దాటి ఆదేశాలు జారీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు లా యూనివర్సిటీలు, విద్యార్థుల పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా విద్యార్థుల క్రమశిక్షణకు సంబంధించిన అంశాల్లో యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసినట్లైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!