

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం నేతలు సెక్రటేరియట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రధాన గేట్ ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది.
అనంతరం పోలీసులు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి సుమారు 8 లక్షల లేఖలను సేకరించారు. ఇటీవల ఈ లేఖలను సెక్రటేరియట్ ప్రధాన గేట్ వద్ద కుప్పగా పోసి నిరసన తెలిపారు. అనంతరం సిబ్బంది ఆ లేఖలను తొలగించి, చీపుర్లతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!