

చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అల్లరి నరేశ్ హీరోగా తెరకెక్కిన ‘రంభ ఊర్వశి మేనక’లో సురభి హీరోయిన్‌గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్, నటి విష్ణుప్రియ చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తనను సినిమాలో అందంగా చూపించిన మేకప్, స్టైలింగ్ టీమ్‌కు విష్ణుప్రియ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను కొంచెం అబ్బాయిలా ఉండేదానినని, అలాంటి తనను అందమైన అమ్మాయిలా కనిపించేలా చేశారని సరదాగా చెప్పి అందరినీ నవ్వించారు. యాంకర్ సుమ తన ముక్కు పొడవు గురించి అడిగిన ప్రశ్నకు ‘ఆకాశమంత’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ఈ చిత్రంలో విష్ణుప్రియ ఊర్వశి పాత్రలో కనిపించనుండగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. చిత్రం సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!