3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

Writer: Chandrika 12:41 PM, 3 సెప్టెంబర్, 2026
యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

యూఎస్‌ ఓపెన్‌ 2026లో స్టార్‌ ప్లేయర్ల ఆట కంటే ఇతర అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్లూయెన్సర్లు, కొందరు ప్రేక్షకుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెన్నిస్‌కు మరింత ప్రచారం కల్పించేందుకు కంటెంట్‌ క్రియేటర్లకు నిర్వాహకులు మీడియా యాక్సెస్‌ పెంచారు. అయితే, కోర్టులో నిశ్శబ్ద వాతావరణానికి భంగం కలిగించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒసాకా–జఖరోవా మ్యాచ్‌ సందర్భంగా కొందరు కంటెంట్‌ కోసం శక్తిమంతమైన రింగ్‌ లైట్లు వినియోగించడం విమర్శలకు దారితీసింది. అలాగే రోజర్‌ ఫెదరర్‌ పాల్గొన్న ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లోనూ కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు పెద్దగా మాట్లాడటం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించినట్లు సమాచారం. గతేడాది 54 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు మీడియా క్రెడెన్షియల్స్‌ ఇవ్వగా.. ఈసారి ఆ సంఖ్య 100 దాటింది. ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కంటెంట్‌ క్రియేటర్ల తీరు ఇబ్బందికరంగా ఉందని టెన్నిస్‌ స్టార్‌ జెస్సికా పెగులా ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు న్యూయార్క్‌లోని టోర్నీ వేదిక పరిసరాల్లో కొందరు ప్రేక్షకుల అతిగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం కూడా చర్చకు దారితీస్తోంది. దీనివల్ల ఆటగాళ్లు, ఇతర ప్రేక్షకులకు అసౌకర్యం కలుగుతోందనే కథనాలు వెలువడ్డాయి. యూఎస్‌ ఓపెన్‌లో ప్రముఖమైన ‘హనీ డ్యూస్‌’ కాక్‌టెయిల్‌కు కూడా భారీ డిమాండ్‌ కొనసాగుతోంది. టోర్నీ ఇంకా పలు రోజులపాటు కొనసాగనున్న నేపథ్యంలో మద్యం మత్తులో ప్రేక్షకులు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించే అవకాశాలపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటపై ఏకాగ్రతకు భంగం కలగకుండా, టోర్నీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

ట్యాగ్లు
యూఎస్ ఓపెన్ 2026టెన్నిస్టెన్నిస్ వార్తలుయూఎస్ ఓపెన్ వివాదంఇన్‌ఫ్లూయెన్సర్లుకంటెంట్ క్రియేటర్లుజెస్సికా పెగులారోజర్ ఫెదరర్న్యూయార్క్టెన్నిస్ అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..
సినిమాలు

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

బిగ్‌బాస్ 10 కామనర్స్‌లో ఈ ఆరుగురికే ఛాన్స్?
షోస్

బిగ్‌బాస్ 10 కామనర్స్‌లో ఈ ఆరుగురికే ఛాన్స్?

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..
క్రీడలు

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్
షోస్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్
గాసిప్స్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..
క్రీడలు

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!
సినిమాలు

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల
జనరల్

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్
జనరల్

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!