

సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ‘రొమాంచకం’ చిత్రానికి విడుదలకు ముందే క్రేజ్ పెరుగుతోంది. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ టికెటింగ్ పోర్టల్ బుక్‌మైషోలో 24 గంటల్లోనే భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉండటం ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తికి నిదర్శనంగా మారింది. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ ఈ చిన్న సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
వేణు గోపాల్ రెడ్డి రచన, దర్శకత్వం వహించిన ‘రొమాంచకం’ను సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రం విభిన్నమైన ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. సాధారణంగా పెద్ద సినిమాలకు కనిపించే బుకింగ్స్ ట్రెండ్ ఈ చిత్రానికి కూడా కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఏర్పడిన పాజిటివ్ బజ్ ఓపెనింగ్స్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో, ప్రేక్షకులను సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!