
జనరల్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ చిత్రం నుంచి తొలి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటంతో ఫస్ట్ సింగిల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ కొత్త జోడీ ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. రవి నేలకూడితి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా, విడుదలకు ముందు మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!