

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న ‘చిరంజీవి’ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్ 28న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ‘పుట్టినవారు మరణించక తప్పదు.. మరణించిన వారు జన్మించక తప్పదు’ అనే భగవద్గీత శ్లోకంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది.
కుడివైపు గుండె ఉండే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న హీరో అనేకసార్లు మృత్యువు నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. మరోవైపు కొన్ని గ్యాంగ్స్ అతడిని వెంటాడుతుంటాయి. హీరోను తల్లి ప్రాణాలకు తెగించి కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా, అతడిని ప్రేమించే యువతి కూడా అతడి భద్రతపై ఆందోళన చెందుతుంది. ఇదే సమయంలో స్పైడర్‌మ్యాన్ గెటప్‌లో ఉన్న ఓ వ్యక్తి విలన్లను వేటాడటం ఆసక్తిని పెంచుతోంది. ‘వేటాడేది పులినైతే వేస్ట్ చేసే ప్రతి బుల్లెట్‌కు ఒక వ్యాల్యూ ఉంటుంది’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరోను ఒక మహిళ తుపాకీతో కాల్చడం వెనుక కారణమేంటి? అతడిని చంపేందుకు ప్రయత్నిస్తున్నవారు ఎవరు? అతడిని కాపాడేందుకు తల్లి, ప్రియురాలు చేస్తున్న పోరాటం ఏమిటి? అనే ప్రశ్నలు క్యూరియాసిటీని పెంచుతున్నాయి. రామకృష్ణ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర సంగీతం, ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ చిత్రానికి బలంగా నిలుస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!