

బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం తన మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తుండగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమై ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి, ఇది మలయాళ హిట్ చిత్రం ‘గురువాయూర్ అంబలనడయిల్’ రీమేక్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రచారంపై తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆమె, ‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’ సినిమా ‘గురువాయూర్ అంబలనడయిల్’ రీమేక్ కాదని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా భిన్నమైన కథతో రూపొందుతున్న ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని వెల్లడించింది. దీంతో ఈ సినిమా పై ఉన్న రూమర్స్‌కు చెక్ పడగా, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!