
జనరల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన మరింత ఆలస్యం కానుందని సమాచారం. ఈ వారంలో అవార్డుల ప్రకటన ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జ్యూరీ సభ్యుల మధ్య ఎంపిక ప్రక్రియపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
జ్యూరీ సభ్యులకు ముందస్తు కమిట్‌మెంట్లు ఉండటమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. విజేతల పేర్లు ప్రకటించడానికి మరికొన్ని రోజులు, ఒక వారం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!