

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్ పెట్ల (పరశురామ్ బుజ్జి) ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన, ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయిన తర్వాత తన తదుపరి ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆయన నెక్స్ట్ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో పరశురామ్ తదుపరి సినిమా గురించి ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో ఆయన సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే, పరశురామ్ కెరీర్‌లో ఇది మరో పెద్ద అవకాశంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!