

టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్, హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'డెకాయిట్'. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌పై భారీ హైప్ నెలకొన్నది. దీనిపై ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్‌లో మృణాల్ ఠాకూర్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుందట. ఆమె సీన్లు సినిమా బిగ్గెస్ట్ హైలైట్స్ అని శేష్ వెల్లడించాడు.
అయితే ఆ బ్లాక్ అంత బాగా రావడానికి దర్శకుడు సుజీత్ కీలక పాత్ర పోషించాడని శేష్ మరో ఆసక్తికర కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో ఇంటర్వెల్ బ్లాక్‌పై కొండంత ఆసక్తి పెరిగింది. శానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 10న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది.ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించడం మరో హైలైట్. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!