
సినిమాలు

క్రేజీ కళ్యాణం చిత్రంలో ప్రముఖ నటీనటులు నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా కనిపించనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. పోస్టర్లో పెళ్లికూతురిగా ఆనందంగా నృత్యం చేస్తున్న ఆమె రూపం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
పెళ్లి నేపథ్యంలో సాగే వినోదభరితమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!