

కోలీవుడ్ యంగ్ బ్యూటీ స్వాసిక తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవల ‘కరుప్పు’ చిత్రంలో కీలక పాత్రతో ఆకట్టుకున్న ఆమె, విజయ్ ఆంటోనీతో కలిసి నటించిన ‘నూరు సామి’ సినిమాతో జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముందే స్వాసిక మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకుని వార్తల్లో నిలిచింది.
ప్రదీప్ రంగనాథన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో తాను కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్వాసిక వెల్లడించింది. మమిత బైజు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అశ్వత్ మరిముత్తు హీరోగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని, తాను కూడా సెట్స్‌లో చేరినట్లు స్వాసిక తెలిపింది. ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!