

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో స్పందించే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. కొందరు తన పేరును అనవసర విషయాల్లోకి లాగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వినోదం, సరదా కోసం తన పేరును దుర్వినియోగం చేసి తన జీవితానికి, కుటుంబానికి ఇబ్బందులు కలిగించవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. తనకు రాజకీయ పదవులు, ప్రత్యేక హోదాలు లేదా ఇతర ప్రయోజనాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
తనకు ఎలాంటి సంబంధం లేని విషయాల్లో తన పేరును ఉపయోగించడం ద్వారా తనకు, తన కుటుంబానికి ఇబ్బందులు కలిగించవద్దని బండ్ల గణేష్ కోరారు. తన ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని, ఇబ్బంది కలిగించేలా తన పేరును ఎవరూ ఉపయోగించవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. సాధారణంగా తనదైన శైలిలో స్పందించే బండ్ల గణేష్ ఇలా చేతులు జోడించి కోరడం అభిమానులు, నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!