

అఖండ 2: ది తాండవం ఘన విజయం సాధించిన సందర్భంగా మేకర్స్ “అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్” ను ఘనంగా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ, చిత్రానికి అఖండ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అఖండ 2 సనాతన హైందవ ధర్మం, గర్వం, తేజస్సును ప్రతిబింబించే చిత్రమని అన్నారు. కుటుంబ సమేతంగా చూసే సినిమాగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిందని, ముఖ్యంగా యువతకు మన మూలాలను గుర్తు చేసే ప్రయత్నమే ఈ చిత్రమని బాలకృష్ణ పేర్కొన్నారు. వరుస విజయాలు తనకు గర్వకారణమని, ఈ విజయం అంతా ప్రేక్షకులదేనని స్పష్టం చేశారు.
దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా ఈ స్థాయికి చేరడానికి ప్రేక్షకుల ఆదరణే కారణమని చెబుతూ బాలకృష్ణ గారి సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. నిర్మాత దిల్ రాజు థియేటర్లలో వచ్చిన అద్భుత స్పందనను గుర్తు చేస్తూ, ఈ చిత్రం దైవత్వంతో ప్రేక్షకులను అనుసంధానించిందన్నారు. సంగీత దర్శకుడు తమన్, రచయితలు, టెక్నీషియన్లు కూడా అఖండ 2 ఒక అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే సినిమా అని, భారతీయ విలువలతో పాన్ ఇండియా స్థాయిలో నిలిచిన బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!