

యాక్షన్ థ్రిల్లర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ మరియు గూఢచారి 2 (G2) సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండింటిలో ముందుగా డెకాయిట్ వచ్చే ఏడాది విడుదల కానుంది. అసలు వచ్చే నెలకే రావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతున్నందున వాయిదా పడింది. రొమాంటిక్ యాక్షన్ లవ్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అడివి శేష్ తన కెరీర్లోనే కాక జీవితంలో తొలిసారి డ్యాన్స్ చేశాడు. సాధారణంగా శేష్ నటించిన సినిమాల్లో పాటలు తక్కువగా ఉంటాయి, డ్యాన్స్ ఇంకా ఉండదు.
కానీ డెకాయిట్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఫుల్ డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. ఈ విషయాన్ని రాజు వెడ్స్ రాంబాయి ట్రైలర్ లాంచ్‌లో వెల్లడిస్తూ “ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు… నా డ్యాన్స్‌కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా” అంటూ సరదాగా చెప్పాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.








.png&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!