

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఇప్పుడు ‘కాక్‌టైల్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హోమి అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. 2012లో విడుదలైన ‘కాక్‌టైల్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని జూన్ 19న విడుదలకు సిద్ధమైంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఈ సినిమాలో ‘దియా’ అనే పాత్రలో కనిపించనున్న రష్మిక, తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్రను పోషించినట్లు తెలిపింది. అల్ట్రా మోడ్రన్ లుక్‌లో కనిపించడం మొదట భయంగా అనిపించినా, కొత్తదనం కోసం ఈ పాత్రను అంగీకరించానని చెప్పింది. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త తరహా పాత్రలను ఆశిస్తారని, అందుకే ఈ సినిమా తనకు ప్రత్యేకమైన అనుభవంగా నిలిచిందని రష్మిక వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!