

‘ధురంధర్’ సినిమా కేవలం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రంగానే కాకుండా, ప్రేక్షకులు సినిమాలను చూసే విధానంపై కూడా ప్రభావం చూపుతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కథనం, నటీనటుల ప్రదర్శన, దర్శకత్వం, సాంకేతిక నైపుణ్యాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సాధించిన విజయంతో హీరో రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి కలిసి పనిచేయనున్నారనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ‘ధురంధర్’ విజయం తర్వాత రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నట్లు సమాచారం. ఈ సినిమా 2027లో సెట్స్‌పైకి వెళ్లి, 2028 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘ధురంధర్’ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, ఆదిత్య ధర్ తదుపరి చిత్రానికి రణ్వీర్ ఆయన ప్రాధాన్య ఎంపికగా ఉన్నారని కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, చంద్రగుప్త మౌర్య జీవిత కథ ఆధారంగా ఆదిత్య ధర్ ఓ చారిత్రక ఇతిహాస చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి కానీ, కథాంశం గురించి కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!