

దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం ఈ నగరానికి ఏమైంది? రిపీట్ బాక్సాఫీస్ వద్ద మంచి ఆరంభాన్ని అందుకుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, పెయిడ్ ప్రీమియర్లతో థియేటర్లలో సందడి చేసింది. ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ లభించినట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, నిజాం ప్రాంతంలో ప్రీమియర్ షోల ద్వారా మాత్రమే ఈ సినిమా ఏకంగా రూ.1 కోటి వసూళ్లు సాధించింది. తొలి రోజే ఈ స్థాయి వసూళ్లు నమోదు చేయడం సినిమాకు మంచి ప్రారంభంగా చెప్పవచ్చు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో పాటు బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉండటంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేశ్ కాకుమాను, అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్నేహం, వినోదం ప్రధానంగా సాగే ఈ బడ్డీ కామెడీ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. ప్రీమియర్ షోలతోనే మంచి వసూళ్లు సాధించడం, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆకట్టుకుంటుండటంతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింతగా రాణిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!