

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. ఇదే సమయంలో సినిమా రన్‌టైమ్‌కు సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఏకంగా 3 గంటల 14 నిమిషాల నిడివితో సినిమాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇంత భారీ రన్‌టైమ్‌లో ఎలాంటి కంటెంట్ ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్’లో యష్ విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడు. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. సెన్సార్ పూర్తి కావడం, భారీ రన్‌టైమ్ వార్తలు రావడంతో ఆగస్టు 26న సినిమా ఎలాంటి అనుభూతిని అందించనుందనే ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!