

కార్తి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘సర్దార్-2’ టీజర్ విడుదల కావడంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ టీజర్లో తండ్రి పాత్రకు సంబంధించిన భావోద్వేగ ఫ్లాష్‌బ్యాక్‌ను మరోసారి చూపించనున్నట్లు సూచించడంతో పాటు తండ్రి, కొడుకు పాత్రలు ఇద్దరూ భారీ యాక్షన్‌తో అలరించనున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా కార్తి, ఎస్.జే. సూర్య మధ్య ఉండే హోరాహోరీ పోరాటాన్ని ఆకట్టుకునేలా చూపించారు.
బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, తాజాగా విడుదలైన టీజర్ పోస్టర్లో ఆ తేదీ లేకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశంపై చర్చ జరుగుతోంది. అయితే విడుదల తేదీపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!