

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వకీల్ సాబ్ మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు ‘అర్జున’ అనే టైటిల్‌ను దిల్ రాజు ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం పూర్తిస్థాయి మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఆయన సినిమా షెడ్యూల్ ఖరారైన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!