

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చివరి షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా క్లైమాక్స్‌కు సంబంధించిన కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ముఖ్యంగా బాలయ్య, మంచు మనోజ్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఈ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈసారి బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం. క్లైమాక్స్ పోరాటాలు, బాలయ్య మాస్ లుక్ సినిమాకు ఏ స్థాయిలో హైలైట్‌గా నిలుస్తాయో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!