

దర్శకుడు కరుణాకరన్, ప్రభాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రభాస్ కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘డార్లింగ్’కు కొనసాగింపుగా ఈ సినిమా ఉండబోతోందని, ప్రస్తుతం కథా చర్చలు, స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అలాంటి ప్రాజెక్ట్ ఏదీ తెరకెక్కడం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌పై ప్రభాస్, దర్శకుడు కరుణాకరన్ లేదా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘ఫౌజీ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టుల తర్వాత ఆయన మరో సినిమాకు ఇంకా సంతకం చేయలేదని సమాచారం. దీంతో తదుపరి ప్రభాస్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో స్పష్టత లేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!