

భారతీయ సినీ పరిశ్రమ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో తొలి ఐమాక్స్ ప్రెజెంటేషన్‌లలో ఒకటిగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విజువల్స్‌పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, చిత్ర కథాంశం, తారాగణం కారణంగా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘రామాయణ’ ట్రైలర్‌ను జూలై 14న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో విడుదల చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందుగానే ట్రైలర్‌ను తీసుకురావాలనే ఆలోచన ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!