
జనరల్

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకున్న ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో సౌత్ ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తోంది.
తాజాగా మా ఇంటి బంగారం మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం హిందీ భాషలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్ర హిందీ ఓటీటీ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. హిందీ ప్రేక్షకుల నుంచి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!