

సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ.160 కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగం ‘జైలర్’ డిజిటల్ హక్కులు సుమారు రూ.100 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. దీంతో సీక్వెల్ హక్కులకు వచ్చినట్లు చెబుతున్న మొత్తం ఆసక్తికరంగా మారింది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘జైలర్ 2’ అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రజినీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా కనిపించనున్నారు. ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కణ్ణన్ ఛాయాగ్రహణం చేస్తున్నారు. ఓటీటీ హక్కులు రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు వస్తున్న వార్తలు నిజమైతే, తమిళ చిత్ర పరిశ్రమలో ఇది భారీ డిజిటల్ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!