

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘మిరాయ్’లో అంబిక ప్రజాపతిగా మెప్పించిన ఆమె, ‘దృశ్యం 3’లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోను శ్రియా శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో రజినీకాంత్ తన తదుపరి చిత్రం ‘ధర్మన్’ గెటప్‌లో కనిపించడంతో.. శ్రియా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారనే ప్రచారం ఊపందుకుంది.
తాజా సమాచారం ప్రకారం ‘ధర్మన్’లో రజినీకాంత్‌తో కలిసి శ్రియా శరణ్ ప్రత్యేక పాటలో నృత్యం చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘శివాజీ’లో ఈ జంట కలిసి నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి ఒకే తెరపై కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. రామ్ పోతినేని, రాశి ఖన్నా, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!