25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె

Writer: Harika S 11:39 AM, 25 ఆగస్టు, 2026
మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె

మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు మరాఠీ మాట్లాడటం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనపై వివాదం ముదిరింది. నిబంధనలను పాటించని డ్రైవర్లకు రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా మరాఠీ నేర్చుకోవాలని, లేకపోతే లైసెన్సులు, పర్మిట్లకు సంబంధించిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడంతో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

రవాణా శాఖ చర్యలను వ్యతిరేకిస్తూ ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మూడు రోజుల సమ్మె ప్రారంభించారు. ముంబై, ఎంఎంఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టడంతో కొన్ని చోట్ల రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వయసు పైబడిన డ్రైవర్లు, తక్కువ విద్యాభ్యాసం ఉన్నవారు తక్కువ సమయంలో మరాఠీ నేర్చుకోవడం కష్టమని డ్రైవర్ సంఘాలు చెబుతున్నాయి. లాంగ్వేజ్ పరీక్షలో విఫలమైతే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధించే ప్రతిపాదనపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు తమ జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని, మరాఠీ నేర్చుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరోవైపు, మరాఠీ నిబంధనను అమలు చేసేందుకు ఆర్టీవో అధికారులు డ్రైవర్లకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుడిని ఎక్కడికి వెళ్లాలి అని అడగడం, ప్రయాణ ఛార్జీని చెప్పడం, మీటర్‌కు సంబంధించిన సాధారణ విషయాలను వివరించడం వంటి రోజువారీ సంభాషణలను మరాఠీలో నిర్వహించగలరా లేదా అన్నదే పరీక్షలో ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అయితే పరీక్షలో విఫలమైన వెంటనే లైసెన్సులు రద్దు చేయబోమని రవాణా శాఖ స్పష్టం చేసింది. భాష నేర్చుకునేందుకు అదనపు సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటికే సుమారు 1.65 లక్షల మంది డ్రైవర్లు మరాఠీ శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందినట్లు సమాచారం.

ఈ వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మరాఠీ నేర్చుకోవాలన్న అంశాన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దని ఆయన అన్నారు. భాష పేరుతో డ్రైవర్ల జీవనోపాధికి నష్టం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయడం లేదని తెలిపారు. మరాఠీ నేర్చుకునేందుకు ఇచ్చిన గడువును పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రయాణికులతో రోజువారీగా మాట్లాడేందుకు అవసరమైన ప్రాథమిక మరాఠీని డ్రైవర్లు నేర్చుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
ట్యాగ్లు
మహారాష్ట్రమరాఠీ భాషా నిబంధనముంబై ట్యాక్సీ సమ్మెఆటో డ్రైవర్లుదేవేంద్ర ఫడ్నవీస్రవాణా శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?

బాలీవుడ్‌లో అనీత్ పడ్డా దూకుడు.. ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర?
సినిమాలు

బాలీవుడ్‌లో అనీత్ పడ్డా దూకుడు.. ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర?

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు
షోస్

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్
సినిమాలు

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల
టెక్నాలజీ

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు
జనరల్

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!
జనరల్

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!
జనరల్

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?
రాజకీయాలు

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!