
షోస్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది. సోమవారం మొత్తం 77,085 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 33,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ.4.61 కోట్ల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మంగళవారం టోకెన్లు లేని సర్వదర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు 8 గంటల్లో దర్శనం లభించే అవకాశం ఉంది. SSD, DD టోకెన్లు ఉన్న భక్తులకు 4 నుంచి 5 గంటల్లో, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం పూర్తయ్యే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!