
సినిమాలు

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #NBK111 మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు టైటిల్ విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ‘God’, ‘Dada’ అనే టైటిల్స్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ రెండు టైటిల్స్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే వీటిలో ఏదో ఒక టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!