
సినిమాలు

ఇరుముడి చిత్రానికి వస్తున్న స్పందన, క్రేజ్ నేపథ్యంలో ఇప్పుడు రెండో భాగంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘ఇరుముడి పార్ట్ 2’ను రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి భాగం కథను నేరుగా కొనసాగించకుండా.. పూర్తిగా భిన్నమైన సెటప్, కొత్త కథతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సీక్వెల్‌లో ఫ్రాంచైజ్‌కి సంబంధించిన ప్రధాన ఆకర్షణను కొనసాగిస్తూనే కొత్త పాత్రలు, కొత్త పరిస్థితులు, విభిన్నమైన కథనాన్ని పరిచయం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కథ, నటీనటులు, షూటింగ్ తదితర వివరాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!