

హెచ్-1బీ వర్క్ వీసా, ఎఫ్-1 ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) కార్యక్రమాలకు కొత్త ఫీజులను నిర్ణయించేందుకు అమెరికా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ న్యాయ సంస్థ ఫ్రాగొమెన్ తెలిపింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ రూపొందించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది. అయితే, కొత్త ఫీజుల మొత్తం ఇంకా వెల్లడించలేదు.
ఆగస్టు 20న ఓపీటీకి సంబంధించిన కొత్త ఫీజు ప్రతిపాదన ఓఎంబీ పరిశీలనకు వెళ్లినట్లు ఫ్రాగొమెన్ తెలిపింది. హెచ్-1బీ వీసా ఫీజుకు సంబంధించిన ప్రతిపాదనను ఆగస్టు 19న ఓఎంబీ సమీక్షించి క్లియర్ చేసినట్లు పేర్కొంది. ఓపీటీ దరఖాస్తులకు లక్ష డాలర్ల వరకు ఫీజు విధించే అవకాశం ఉందన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆ మొత్తం ఇంకా ఖరారు కాలేదని ఫ్రాగొమెన్ స్పష్టం చేసింది. రెండు ప్రతిపాదనల వివరాలు గోప్యంగా ఉండటంతో తుది ఫీజులపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!