

బిగ్ బాస్ తెలుగు 10 వచ్చే నెలలో ప్రారంభం కానుండటంతో షోపై బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మైలురాయి సీజన్ కావడంతో కంటెస్టెంట్ల ఎంపికపై కూడా భారీగా చర్చ జరుగుతోంది. హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారనే ఆసక్తి ఒకవైపు ఉండగా.. మరోవైపు బిగ్ బాస్ టీమ్ సంప్రదించినప్పటికీ షోలోకి వెళ్లేందుకు నో చెప్పిన టీవీ సెలబ్రిటీల పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి.
విష్ణు
టెలివిజన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రస్తుతం స్టార్ మా సీరియల్ గుండెనిండా గుడిగంటలు ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇందులో బాలు పాత్రలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ టీమ్ విష్ణును సంప్రదించి ఆకర్షణీయమైన రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఆయన ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.
తేజశ్విని గౌడ
బిగ్ బాస్ తెలుగు విషయంలో కొంతకాలంగా వినిపిస్తున్న మరో పేరు తేజశ్విని గౌడ. టీవీ సీరియల్ నటిగా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అలాగే నటుడు అమర్ దీప్ చౌదరి భార్యగా కూడా ప్రేక్షకులకు సుపరిచితం. గత రెండు, మూడు సీజన్లుగా బిగ్ బాస్ మేకర్స్ ఆమెను సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. షోలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. సీరియల్ కమిట్‌మెంట్స్ కారణంగా ఆమెకు అవకాశం కుదరలేదని తెలుస్తోంది. ఈసారి కూడా ఇదే కారణంతో ఆఫర్‌ను తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది.
దెబ్ జాన్
దెబ్ జాన్ కూడా బిగ్ బాస్ 10 ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ వంటి సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మరో భాషలో ఓ సీరియల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీరియల్ మంచి రేటింగ్స్‌తో కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ను వదులుకుని బిగ్ బాస్‌లోకి వెళ్లేందుకు ఆమె సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది.
కావ్యశ్రీ
ఇక సీరియల్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న కావ్యశ్రీ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. బిగ్ బాస్ మేకర్స్ గత రెండు సీజన్లుగా ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే రియాలిటీ షోలో పాల్గొనడంపై ఆమెకు పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్‌కు వచ్చిన ఆఫర్‌ను కూడా కావ్యశ్రీ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ పేర్లకు సంబంధించి బిగ్ బాస్ టీమ్ నుంచి అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల ప్రస్తుతం వస్తున్న సమాచారాన్ని రూమర్స్‌గానే పరిగణించాలి. వచ్చే నెలలో బిగ్ బాస్ 10 ప్రారంభానికి ముందు అధికారిక కంటెస్టెంట్ల జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది. అప్పుడే ఎవరు హౌస్‌లోకి వస్తున్నారు, ఎవరు షోకు దూరంగా ఉన్నారు అనే విషయంపై పూర్తి స్పష్టత రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!