
జనరల్

దేశీయ విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి ఇకపై ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో ఫిజికల్ బోర్డింగ్ పాస్ చూపించాల్సిన అవసరం ఉండదు. సెప్టెంబర్ 1 నుంచి ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఈ–బోర్డింగ్ పాస్‌ను చూపిస్తే సరిపోతుంది. సంబంధిత ప్రయాణ పత్రాలపై ఫిజికల్ స్టాంపింగ్ ప్రక్రియను తొలగించడంతో ఈ మార్పు అమల్లోకి రానుంది.
ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్–ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP)లో నమోదు చేసుకున్న ప్రయాణికులు కూడా ఈ–గేట్ల వద్ద ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని బీవోఐ తెలిపింది. పేపర్‌రహితంగా, మరింత సులభంగా అంతర్జాతీయ ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!