

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరోసారి కొత్త ప్రతిభను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పిస్తూ ఓ చిత్రాన్ని నిర్మించిన ఆయన.. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్, కే ప్రొడక్షన్స్ బ్యానర్లపై మరో కొత్త చిత్రాన్ని సమర్పించనున్నట్లు తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలోనూ పూర్తిగా కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను పరిశీలిస్తే.. మిస్టరీని తలపించే ఓ భయానక ఆకారాన్ని ఆసక్తికరంగా చూపించారు. “మీరు ఎప్పుడూ చూడని కథ.. మీరు ఎప్పుడూ ఊహించని జానర్” అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అనుష్ గోరక్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. శివ శంకర నాయుడు వై, కిరణ్ అబ్బవరం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా కథ, నటీనటులు, సాంకేతిక బృందం తదితర పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!