
క్రీడలు

భారత సంతతికి చెందిన వ్యోమగామి అనిల్ మేనన్, మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి రష్యా సోయుజ్ ఎంఎస్ 29 వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు విజయవంతంగా చేరుకున్నారు. కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి మంగళవారం రాత్రి 8:17 గంటలకు రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది.
ప్రయాణం ప్రారంభమైన ఎనిమిది నిమిషాల్లోనే వ్యోమనౌక ప్రాథమిక కక్ష్యలోకి చేరుకుంది. అనంతరం మూడు గంటల ప్రయాణం తర్వాత రాత్రి 11:52 గంటలకు ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు అనిల్ మేనన్, మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించి తమ మిషన్‌ను ప్రారంభించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!