
బిజినెస్

నేపాల్‌కు చెందిన దీపా భట్టారాయ్ అమెరికాలో విద్య కోసం వెళ్లి, అక్కడ ఎదురైన చట్టపరమైన అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించారు. 2013లో అమెరికాకు వెళ్లిన ఆమె ఐబ్రో థ్రెడింగ్ వ్యాపారం ప్రారంభించగా, 2018లో కాస్మెటాలజీ లైసెన్స్ లేదని అధికారులు సెలూన్‌ను మూసివేశారు. థ్రెడింగ్‌కు సంబంధం లేని 600 గంటల శిక్షణను తప్పనిసరి చేయడాన్ని ఆమె ప్రశ్నించారు.
2019లో మిసిసిపీ జస్టిస్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో కోర్టును ఆశ్రయించిన దీప పోరాటం ఫలించి, 2021లో చట్టంలో మార్పు వచ్చింది. దీంతో ఐబ్రో థ్రెడింగ్, మేకప్ వంటి సేవలకు లైసెన్స్ నుంచి మినహాయింపు లభించింది. ప్రస్తుతం ఆమె పలు సెలూన్లను విజయవంతంగా నిర్వహిస్తుండగా, ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందిన 'Threading the American Dream' డాక్యుమెంటరీ అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రదర్శితమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!