

సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయాన్ని సాధించిన తర్వాత, మెగాస్టార్ చిరంజీవి తదుపరి ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టారు. దర్శకుడు బాబీ కొల్లితో రెండోసారి చేయబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో చిరంజీవికి జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ఎంపిక అయిందని తాజా రూమర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సినిమా చిరంజీవి 158 వ చిత్రంగా రూపొందుతుంది. ప్రీ-ప్రొడక్షన్ పూర్తయి, ముఖ్య పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. కృతి శెట్టి చిరంజీవి కూతురు పాత్రలో కనిపించనుంది. కథ తండ్రి-కూతురు సంబంధం చుట్టూ సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నారు.
ఇతర నటీనటుల విషయానికి వస్తే, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశముందన్న ఊహాగానాలు కూడా జోరుగా ఉన్నాయి. సంగీత దర్శకుడిగా లెజెండ్ ఏ ఆర్ రెహామన్ ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెస్తున్నాయి. ఇలా చిరంజీవి మూవీపై రూమర్లు, క్యాస్టింగ్ వార్తలు ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. చిరుకు జోడీగా ప్రియమణి ఎంపిక నిజమైతే బాబీ ప్లాన్ పూర్తిగా క్లియర్ అయినట్టేనా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఇప్పటివరకు వినిపిస్తున్న సమాచారం మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటి నుంచే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మార్చేస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!