
జనరల్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్–2025 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త స్థానిక క్యాడర్ వ్యవస్థను అధికారికంగా నోటిఫై చేసింది. ఈ మేరకు రాష్ట్రాన్ని ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల పరిపాలన, నియామక ప్రక్రియను మరింత వ్యవస్థీకృతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
శాఖల వారీగా జిల్లా క్యాడర్, జోనల్ క్యాడర్, మల్టీ జోనల్ క్యాడర్, రాష్ట్ర స్థాయి పోస్టులను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్–2025 నిబంధనలకు అనుగుణంగా నియామకాలు, బదిలీలు, సేవా పరిపాలనలో స్పష్టత తీసుకురావడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!