

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు చాలా మంచి డిమాండ్ ఉంటుంది. రాజమౌళి ఇప్పటి వరకు వరుసగా 12 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి అపజయం ఎరుగని దర్శకుడిగా మొదటి స్థానంలో ఉండగా, తన తర్వాతి స్థానంలో అనిల్ రావిపూడి ఉన్నాడు. తొమ్మిది వరుస విజయాలతో తన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆయన, ఇటీవల సంక్రాంతి బరిలో విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు తో మెగాస్టార్ చిరంజీవికి భారీ విజయాన్ని అందించాడు. ఈ సినిమాతో చిరంజీవిని 400 కోట్ల క్లబ్లో చేర్చిన ఘనత కూడా అనిల్‌కే దక్కింది.
ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదట ఈ సినిమా వెంకటేష్‌తో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో స్టార్ హీరో కళ్యాణ్ రామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారని అనిల్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. “నన్ను 100 కోట్ల క్లబ్లో చేర్చిన వెంకటేష్, నాకు మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది” అని ఆయన తెలిపారు.
ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, బావ – బామ్మర్దుల మధ్య జరిగే ఎమోషనల్ కథతో పాటు యాక్షన్ మరియు కామెడీకి కూడా పెద్ద స్థానం ఇవ్వనున్నారని సమాచారం. కథలో బామ్మర్ది తన బావకు ఎదురైన కష్టాలను ఎలా తీర్చాడు, ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఎలా సర్దుకున్నాయి అన్నదే ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ఈసారి ప్రేక్షకులను గాఢమైన భావోద్వేగ కథతో ఆకట్టుకోవాలని అనిల్ రావిపూడి లక్ష్యంగా పెట్టుకున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!