
జనరల్

పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన చేపట్టిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవడంతో పాటు వేలాది మంది యువతను చైతన్యపరిచి పారదర్శక పరీక్షా వ్యవస్థ కోసం గళం విప్పేలా చేసింది.
వాంగ్‌చుక్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు సమాచారం వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలకు ముందుకు రాలేదు. ఆయన దీక్ష విరమించాలని సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అయితే, "దీక్ష ఆపాలని నన్ను అడగొద్దు.. కనీసం ప్రభుత్వం చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించండి" అంటూ వాంగ్‌చుక్ ప్రజలకు పిలుపునిచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!