

మాజీ ప్రధాని షేక్ హసీనా మరో ఆరు నెలల్లో స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం అవామీ లీగ్పై నిషేధం కొనసాగుతుండగా, పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు జైలులో, ప్రవాసంలో లేదా బెయిల్‌పై ఉన్నారు. హసీనా దీర్ఘకాలంగా దేశానికి దూరంగా ఉండటంతో పార్టీలో ఒక వర్గం ఆమెకు పూర్తి మద్దతు ఇస్తుండగా, మరో వర్గం పార్టీ సంస్కరణలు, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే అభిప్రాయంతో ఉంది.
ఇక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సంస్కరణవాద నాయకత్వానికి అవకాశం కల్పించే దిశగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు జమాత్-ఇ-ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ మాత్రం అవామీ లీగ్ పునరాగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తానన్న ప్రకటన వ్యక్తిగత నిర్ణయమా, పార్టీ పునర్వ్యవస్థీకరణ కోసమా, లేక రాజకీయ వ్యూహమా అనే అంశంపై విస్తృత చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!