

హీరో రుత్విక్ తొలి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'రాజా ది రాజా' సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో విశాఖ ధిమాన్ కథానాయికగా నటించారు. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తుండగా, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూలై 17న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
విలేకరుల సమావేశంలో మాట్లాడిన రుత్విక్, ఈ సినిమా ఎంతో ప్రేమతో, ప్యాషన్‌తో రూపొందిందని తెలిపారు. రెండు భిన్నమైన గెటప్స్ కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యానని, నటుడిగా తన ప్రయాణంలో షార్ట్ ఫిల్మ్స్, అమెరికాలో ఫిల్మ్ కోర్స్, కఠినమైన సాధన ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. దర్శకుడు అనిల్ బోయిడపు, సీనియర్ నటులు నరేష్, సాయికుమార్, హీరోయిన్ విశాఖ ధిమాన్ సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. మంచి విజువల్స్, అద్భుతమైన సంగీతం, భావోద్వేగాలు, వినోదంతో కూడిన ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!