

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, అనిల్ కపూర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ టీమ్ జోర్డాన్ ఎడారి ప్రాంతాల్లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు ఒక మాస్ సాంగ్‌ను చిత్రీకరించింది. ఎన్టీఆర్ స్వయంగా రిస్కీ స్టంట్స్ చేయడం అభిమానుల్లో ఉత్సాహం రేపింది. అయితే, ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు ఉత్కంఠత సృష్టించడంతో జోర్డాన్ సహా పశ్చిమాసియా దేశాలు గగనతలాన్ని మూసివేశాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న డ్రాగన్ టీమ్ సురక్షితంగా బయటపడటంపై టాలీవుడ్లో చర్చ నడిచింది.
అయితే ప్రశాంత్ నీల్ టీమ్ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, షూటింగ్‌ను ఫిబ్రవరి 22 నాటికి పూర్తి చేసి భారత్‌కి తిరిగివచ్చింది. ఎన్టీఆర్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మిగిలిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక ఈ భారీ యాక్షన్ మూవీ జూన్ 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!