

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన టైటిల్ వేటను జూన్ 14న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. జూన్ 12 నుంచి జులై 5 వరకు జరిగే ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. మొత్తం 12 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్-1లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో కలిసి పోటీపడుతుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ శ్రీలంకతో తలపడుతుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఇదే వేదికలో జరగనుంది.
తదుపరి మ్యాచ్‌ల్లో భారత్ జూన్ 17న నెదర్లాండ్స్‌తో, 21న దక్షిణాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. జూన్ 30 మరియు జులై 2న సెమీఫైనల్స్ నిర్వహించగా, జులై 5న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!