

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి ఇప్పటికే భారీ అంచనాలను రేపుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. తాజాగా ఆమె పారితోషికం గురించి వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వారణాసి కోసం ప్రియాంక చోప్రా దాదాపు ₹30 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం పొందిన హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డు సృష్టించినట్టే. సాధారణంగా బాలీవుడ్లో టాప్ హీరోయిన్లు రూ.10 కోట్ల వరకు తీసుకుంటుండగా, ప్రియాంకకు ఈ భారీ పారితోషికం ఆమె అంతర్జాతీయ గుర్తింపు, హాలీవుడ్ ఇమేజ్ కారణంగానే వచ్చినదని విశ్లేషకులు చెబుతున్నారు.
వారణాసి సినిమాలో మహేష్ బాబు “రుద్ర”, ప్రియాంక “మందాకిని” పాత్రల్లో నటించనున్నారు. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. 2000 BC నుంచి 2027 వరకు విస్తరించిన టైమ్‌లైన్‌లో ఈ సినిమా సాగుతుంది. రాజమౌళి దర్శకత్వంలో IMAX ఫార్మాట్లో రూపొందుతున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ చిత్రం విజువల్ గ్రాండియర్‌కు నిదర్శనంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!