

హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలను అందుకుంటూ కథానాయిక సాయిపల్లవి బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో పాటు ‘కల్కి 2’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల్లోనూ ఆమె పేరు వినిపిస్తోంది. ఇదే సమయంలో అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న ప్రేమకథా చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించే అవకాశముందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది.
సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన సాయిపల్లవిపై దర్శకుడు మణిరత్నం గతంలోనే తన అభిమానం వ్యక్తం చేశారు. ఆయన సినిమా కోసం ఆమె పేరు వినిపించడం సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కాంబినేషన్ ఖరారైతే బలమైన కథ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే మరో విశేషమైన చిత్రంగా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!