

టాలీవుడ్లో కమర్షియల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుపొందిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయం సాధించాడు. ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయంతో ఆయన తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా అనిల్ రావిపూడి మరో భారీ మల్టీస్టారర్‌కి సిద్ధమవుతున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. గతంలో వీరిద్దరూ పటాస్ తరువాత మరోసారి కలిసి పనిచేయడం ప్రత్యేకతగా మారింది. దగ్గుబాటి, నందమూరి కుటుంబాల హీరోలు ఒకే తెరపై కనిపించబోతున్నారని వార్త అభిమానుల్లో ఉత్సాహం కలిగించింది.
ఇక సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మహానటితో నేషనల్ అవార్డు గెలుచుకున్న కీర్తి, ఇప్పుడు వెంకీ మామ సరసన నటించబోతున్నందుకు అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్, వెంకటేష్ స్టైల్ కలిస్తే మరో సూపర్ హిట్ ఖాయం అని టాక్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం (AK-47) చిత్రీకరణలో ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!